FbTelugu

వాళ్లకు రెడ్ కార్పెట్… రైతులపై లాఠీఛార్జీలు: ప్రియాంకా

ఢిల్లీ: ఛలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వస్తున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా తీవ్రంగా తప్పుపట్టారు.

బీజేపీ ప్రభుత్వం తీరు ఎలా ఉందో చూడండి, బిలియనీర్ మిత్రులు వస్తే రెడ్ కార్పెట్లు పరిచి స్వాగతం పలుకుతారు, రైతులు వస్తామంటే బ్యారికేడ్లు, బాష్పవాయువు ప్రయోగిస్తున్నారని ఆమె ట్వీటర్ లో మండిపడ్డారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు వస్తున్న రైతులను రానివ్వకుండా రోడ్లపై గోతులు తవ్వారని ఆమె ఆరోపించింది. తమ గోడు చెప్పుకునేందుకు ఢిల్లీకి వస్తే తప్పేంటని ప్రియాంకా నిలదీసింది.

కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు నిన్న చేపట్టిన విషయం తెలిసిందే. వీరిని అడ్డుకునేందుకు ఢిల్లీ-హర్యానా బార్డర్ లో రైతులను అడ్డుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.