FbTelugu

రెడ్ అలర్ట్… రెండు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్: బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆదివారం, సోమవారం రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ప్రజలందరూ అప్రమత్తమంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. తెలంగాణ ప్రభుత్వం వర్షాలు, సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. మరికొద్ది రోజులు రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. సహాయం కోసం 040-23450624 నెంబర్ కు ఫోన్ చేసి తెలియచేయాలని ప్రభుత్వం తెలిపింది.

You might also like