FbTelugu

ముంబైలో రెడ్ అలెర్ట్

భారత ఆర్థిక రాజధానిగా పిలువబడే ముంబైని వానలు ముంచెత్తుతున్నాయి. వర్షం తీవ్రంగా పడుతుండడంతో ఇప్పటికే ముంబైలోని అనేక ప్రాంతాలను చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ముంబైనగరానికి రెడ్ అలెర్ట్ ప్రకటించింది.

మరో రెండు రోజుల పాటూ వర్షాలు ఉంటాయని తెలిపింది. సముద్రంలో 4.51 మీటర్ల ఎత్తైన ఆటుపోట్లు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి.

You might also like