FbTelugu

ముంబై వాసులకు రెడ్ అలెర్ట్

భారత ఆర్థిక రాజధాని అయిన ముంబయికి వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. గత కొన్ని రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతూనే ఉండగా.. మరో రెండ్రోజులు ముంబైతోపాటు సమీప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ.. వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్ జారీ చేసింది.

ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం అయినాయి. కాగా తాజాగా ప్రజలెవరూ బయటకు రావొద్దంటూ.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వాసులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

You might also like