FbTelugu

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు..

హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. మునుపెన్నడూ లేని విధంగా ఆదివారం ఒక్కరోజే కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

అయిదుగురు మృత్యు వాత పడ్డారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ లో ఒక్కరోజే 122 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 122 మందిలో పోలీసు సిబ్బంది ఉన్నారు. అలాగే లాక్ డౌన్ సడలింపు సమయంలో ఇలా కేసులు ఒక్క సారిగా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది.

జిల్లాల వారీగా చుస్తే రంగారెడ్డిలో 40, మేడ్చల్‌లో 10, ఖమ్మంలో 9, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, మెదక్‌లో 3 చొప్పున కరోనా కేసులు నమోదు కాగా వరంగల్‌ అర్బన్‌లో 2, సూర్యాపేట, నిర్మల్‌, యాదాద్రి, జనగాంలో ఒక్కో కేసు నమోదు అయింది. కొత్తగా ముగ్గురు వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.

You might also like