FbTelugu

రికార్డు బ్రేక్… తెలంగాణలో 730 కేసులు

హైదరాబాద్: తెలంగాణలో రికార్డు బ్రేక్ అయింది. తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు 730 నమోదు అయ్యాయి.

దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7802కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో కోలుకొని 3731 మంది డిశ్చార్జ్ కాగా 3861 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఇవాళ ఏడుగురు మరణించగా ఇప్పటి వరకు 210 మంది మృతి చెందారు.

గడచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 3,297 నమూనాలు సేకరించారు.  జీహెచ్ఎంసీ పరిధిలో 659 కేసులు నమోదు కాగా, జనగాం 34,రంగారెడ్డి 10,మేడ్చల్ 9, వరంగల్ 6, ఆసిఫాబాద్ 3, సంగారెడ్డి, వికారాబాద్ 2, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, మెదక్, నల్లగొండ, యాదాద్రి జిల్లాలో 1 కేసు చొప్పున నమోదయ్యాయి.    ఒకే రోజు 730 కేసులు నమోదు కావడంతో ప్రజలు కలవర పడుతున్నారు. కరోనా పాజిటివ్ ప్రారంభం నుంచి తొలిసారి ఇంత భారీగా కేసులు నమోదు అయ్యాయి.

You might also like