FbTelugu

బెజవాడలో తొలగించిన గుళ్ల పునర్నిర్మాణం

విజయవాడ: నగరంలో తొలగించిన గుళ్లు తిరిగి నిర్మించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గతంలో కృష్ణా పుష్కరాల సమయంలో కొన్ని గుళ్లు తొలగించారు.
హిందూ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నదనే విమర్శలు రావడంతో వైసీపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.

టీటీడీ ఆస్తుల విక్రయం, డిక్లరేషన్, అంతర్వేది రథం దగ్ధం వంటి ఘటనల నుంచి జనం దృష్టి మళ్లించేందుకు వైసీపీ ప్రభుత్వం ఆలయాల పునర్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నది. నగరంలో ఆలయాల పునర్ నిర్మాణం సాధ్యమైనంత త్వరగా దశలవారీగా చేపట్టే యోచనలో దేవాదాయశాఖ ఉంది.
సీజీఎప్ నిధులతో గుళ్లను పునర్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వీటిపై సంబంధిత పీఠాధిపతుల సలహాలు దేవాదాయ శాఖ తీసుకోనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.