FbTelugu

పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు?

పుదుచ్చేరి: సభ్యుల బలం లేక ప్రభుత్వం పడిపోవంతో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనిపై నిర్ణయం తీసుకున్న లెప్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కేంద్ర హోం శాఖకు సిఫారసు చేయనున్నట్లు తెలిసింది.

కాంగ్రెస్-డీఎంకే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడంతో బల నిరూపణకు ముందే ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉండడంతో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని లెప్టినెంట్ గవర్నర్ కేంద్ర హోం శాఖ మంత్రికి వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన మినహా ఏమీ చేయలేమని చెప్పినట్లు సమాచారం. ఈ అంశంపై లెప్టినెంట్ గవర్నర్ రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నది. ఈ మేరకు ఆమె రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ కేంద్ర హోం శాఖకు లేఖ పంపించిందని సమాచారం. కేంద్రం ఆమోదించగానే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి రాష్ట్రపతి పాలన అమలు చేస్తారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.