FbTelugu

. తాజాగా ,కొత్తరకం వేరియంట్ వెలుగుచూసింది….

. తాజాగా, దక్షిణాఫ్రికా, బోట్సవానా, హాంకాంగ్‌లో కొత్తరకం వేరియంట్ వెలుగుచూసింది .దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్ ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. ఈ వేరియంట్ హెచ్చరికలు స్టాక్ మార్కెట్‌‌ను తీవ్ర ప్రభావితం చేశాయి. సెన్సెక్స్ ఏడు నెలల తర్వాత భారీగా నష్టపోయింది. ‌ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ B.1.1.529 టీకాల సమర్ధతను కూడా నిరోధించి, వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరింత తీవ్రమైన లక్షణాలకు దారితీసే అధిక సంఖ్యలో స్పైక్ మ్యుటేషన్‌లను ఇది కలిగి ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో రెండో దశ వ్యాప్తికి కారణమైన డెల్టా కంటే ప్రమాదకారని భావిస్తున్నారు తొలిసారి దక్షిణాఫ్రికాలో వెలుగుచూడగా.. ఇప్పటి వరకూ ఈ కేసుల సంఖ్య 100 దాటినట్టు తెలుస్తోంది. బోట్సవానాలో నాలుగు, హాంకాంగ్‌లో రెండు కేసులు నిర్ధారణ అయ్యాయి. దక్షిణాఫ్రికా నుంచి హాంకాంగ్‌కు వచ్చిన ప్రయాణికుల్లో ఈ కేసులు బయటపడ్డాయి. వీరి నమూనాల్లో వైరల్ లోడ్ చాలా తీవ్రంగా ఉన్నట్టు అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఎరిక్ ఫైగల్ డింగ్ అన్నారు. ‘PCR పరీక్షల్లో 18-19 శాతంగా ఉందని, ఇటీవలి పీసీఆర్ నెగెటివ్ పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా ఎక్కువ’ అని పేర్కొన్నారు.

కొత్త వేరియంట్ భయంతో దక్షిణాఫ్రికా, బోట్సవానా సహా మరో నాలుగు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలను బ్రిటన్, సింగపూర్, ఇజ్రాయేల్ నిలుపుదల చేశాయి. జర్మనీ, ఇటలీ కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. B.1.1529 వేరియంట్ అసాధారణంగా పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలను కలిగి ఉందని యూసీఎల్ జెనెటిక్స్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ బల్లౌక్స్ అన్నారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.