FbTelugu

టీఆర్ఎస్ ఓటమికి కారణమదే: పవన్ కల్యాణ్

చిత్తూరు : నివర్ తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతుల పంటపొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ 5 జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులను పరామర్శించి మాట్లాడారు. కౌలు రైతుల ఆత్మహత్యలను విస్మరించడమే దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి కారణమని అన్నారు.

పంటలను నష్టపోయిన రైతులకు కనీసం రూ.25 వేల నుంచి రూ.30 వేల పరిహారం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలని సూచించారు. అన్న దాతకు అండగా జై కిసాన్ కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. కౌలురైతులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.