FbTelugu

రిటైర్ అయిన టిటిడి అర్చకుల పునర్నియామకం

తిరుమల: టీటీడీ సంచలన నిర్ణయంపై అర్చకుల్లో విస్మయం వ్యక్తమవుతున్నది. పదవీ విరమణ చేసిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటా టీటీడీ ఉత్తర్వులు జారీ చేయడంపై ప్రస్తుత అర్చకులు మండిపడుతున్నారు.

పదవీ విరమణ చేసిన ప్రధాన అర్చకుడితో పాటు మిగతా అర్చకులు విధుల్లో చేరాలంటూ ఆదేశాలిచ్చారు. హైకోర్టు తీర్పు (38118/2018 ) మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు టీటీడీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా ఆదేశాలతో తిరిగి ప్రధాన అర్చకుడి హోదాలోకి రమణదీక్షితులు రానున్నారు. ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు కొనసాగడంపై సందిగ్ధత నెలకొన్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.