FbTelugu

మరో ఆరు నెలల్లో రియల్ మీ ల్యాప్ ట్యాప్

న్యూఢిల్లీ: మరో ఆరు నెలల్లో ఇండియా మార్కెట్ లోకి రియల్ మీ ల్యాప్ ట్యాప్ లను విడుదల చేసేందుకు కంపెనీ ఏర్పాట్లు చేసుకుంటున్నది. వర్క్ ఫ్రమ్ హోం కారణంగా లక్షలాది మంది ఇంటినుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.

వర్క్ ఫ్రమ్ హోం కారణంగా ల్యాప్ ట్యాప్ లను డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ తీర్చేందుకు రియల్ మీ ల్యాప్ ట్యాప్ లను మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో లాపీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.30వేల నుంచి రూ.50వేల మధ్య ధరలు ఉండవచ్చని అంటున్నారు. షావోమి విడుదల చేసిన నోట్ బుక్ 14 కు రియల్ మీ గట్టి పటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. హానర్ కూడా గతేడాది మ్యాజిక్ బుక్ 15 పేరుతో తొలి లాపీని మార్కెట్ లోకి విడుదల చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.