FbTelugu

ఇక ఆర్టీజీఎస్ నిరంతరం

ముంబై: రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్ (ఆర్టీజీఎస్) ను ఇకనుంచి వారంలో ప్రతిరోజు అందుబాటులో ఉండనున్నది. వచ్చే డిసెంబర్ నుంచి అమల్లోకి వస్తుందని ఈ మేరకు ఆర్బీఐ ప్రకటించింది.

ప్రస్తుతం నెలలో రెండు, నాలుగు శనివారాలు, ఆదివారాలు మినహా మిగిలిన అన్ని పని దినాలలో ఉదయం7 గంటల నుంచి సాయంత్రం 6వరకు మనీ ట్రాన్స్ ఫర్ (నెఫ్ట్) సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే 2019 డిసెంబర్ నుంచి ఈ సౌకర్యాన్ని నిరంతరం అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇది విజయవంతం కావడంతో పెద్ద మొత్తాల బదిలీ కోసం ఆర్టీజీఎస్ ను సైతం వారం రోజులు 24 గంటల పాటు అందించాలని నిర్ణయించారు. ఆర్టీజీఎస్ కింద రూ.2 లక్షల నుంచి గరిష్టంగా ఎంత మొత్తం అయినా బదిలీ చేసుకునే వెసులుబాటు ఉండనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.