FbTelugu

ఏపీలో భూముల రీ-సర్వే

* నోటిఫికేషన్‌ జారీచేసిన ప్రభుత్వం
* ఈ నెల 21న ప్రారంభం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో భూముల రీ-సర్వేకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. రాష్ట్రంలో ఈ నెల(డిసెంబర్) 21న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడు, రామచంద్రునిపేటలోఅధికారికంగా ప్రారంభించనున్నారు. రీ-సర్వే జరిగే గ్రామాల్లో జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. తేదీల వారీగా ఏయే గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నది ప్రకటించనున్నారు.

తొలి విడతలో 5,000, మలివిడతలో 6,500, మూడో విడతలో 5,500 గ్రామాల్లో నిర్వహిస్తారు.భూమి రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తైన గ్రామాల్లో ఈ రీ-సర్వే జరగనుంది. అయితే ఇప్పటికే నిర్వహించిన రీసర్వేలో సర్వే నెంబర్లు భారీగా పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో 2 వేల మంది పంచాయతీ కార్యదర్శులు, 4,500 మంది వీఆర్వోలు, 9 వేల 500 మంది గ్రామ సర్వేయర్లు పాల్గొంటారు. సర్వేకు అనుగుణంగా గ్రామాల్లో ఫీల్డ్‌ మ్యాపులు, గ్రామ పటాలు సిద్ధం చేస్తున్నారు. డ్రోన్ల సాయంతో, కార్స్‌ ద్వారా భూముల రీసర్వేను చేపట్టనున్నారు. 650 మొబైల్‌ మేజిస్ట్రేట్‌ బృందాలు రీసర్వే కోసం ఏర్పాటు కానున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.