FbTelugu

తిరిగి తెరుచుకున్న బేగం బజార్

హైదరాబాద్: బేగంబజార్, గోషామహల్ ల మళ్లీ దుకాణాలు తెరచుకున్నాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో బేగంబజార్ హోల్ సేల్ వ్యాపారులు వారం రోజుల పాటు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటించారు.

పాజిటివ్ కేసులు తగ్గకున్నా షాపులు తెరవకుండా ఉండలేని పరిస్థితి నెలకొనడంతో పునరాలోచనలో పడ్డారు. మొత్తం 550 దుకాణాలు నిన్నటి వరకు మూతబడ్డాయి. రాష్ట్రంలో 80శాతం కిరాణా దుకాణాలకు బేగం బజార్ నుండే సరకులు రవాణా అవుతాయి. రిటైల్ మార్కెట్లు ఇబ్బంది పడుతున్నందున తెరుస్తున్నామంటూ వర్తక సంఘం సభ్యులు తెలిపారు.

You might also like