FbTelugu

ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన ఆర్డీఓ

విజయనగరం: ఆర్డీఓ హేమ‌ల‌త అతి సామాన్యురాలిగా ఆధార్‌కార్డు పట్టుకొని గురువారం సాయంత్రం ఘోషా ఆస్పత్రికి వెళ్లి సిబ్బందిని కలిశారు.

తనకు తొమ్మిది నెలలు నిండాయని, ప్రసవం కోసం వచ్చానని చెప్పడంతో వైద్యులు వెంటనే ఆస్ప‌త్రిలో చేర్చుకున్నారు. ఈ లోపు ప్రసవానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ లోపు ఆమె ఆర్డీఓ అని అక్కడ సిబ్బంది గుర్తించి అప్రమత్తమయ్యారు. రాత్రి 11.54 గంటలకు ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

You might also like