FbTelugu

ఇక సెలవు రోజుల్లో జీతాల చెల్లింపులు: ఆర్.బి.ఐ

ముంబయి: దేశంలో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. ఇక నుంచి సెలవు రోజుల్లో కూడా వేతనాలు చెల్లించే విధంగా నూతన సిస్టమ్ ను తీసుకువచ్చింది.
ఈ వివరాలను ఆర్.బి.ఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి అన్ని రోజులు నేషనల్ ఆటోమెటెడ్ క్లియిరంగ్ హౌస్ (ఎన్.ఏ.సి.హెచ్) ను అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఆదివారాలతో పాటు అన్ని బ్యాంకు సెలవు దినాల్లో ఈ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఖాతాదారులు ఆదివారం లేదా అన్ని సెలవు దినాల్లో చెల్లింపులు చేయవచ్చని అన్నారు. మ్యుచువల్ ఫండ్స్, హోం లోన్, కారు, పర్సనల్ లోన్, మొబైల్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ బిల్లులను పూర్తి చేయవచ్చు. ఇప్పటి వరకు సెలవు లేదా ఆదివారాల్లో వేతనాలు వేసేందుకు వెసులుబాటు లేదు. ఎన్.ఏ.సి.హెచ్ ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజి సబ్సిడి కోసం ప్రారంభించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అత్యంత ప్రజాధరణ పొందింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.