FbTelugu

రాజధాని ఏర్పాటుపై రాయలసీమ బంద్

Rayalaseema-Band-on-capital-formation

కర్నూలు: రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌పై గురువారం రాయలసీమ జిల్లాల విద్యాసంస్థల బంద్‌ నిర్వహిస్తున్నట్లు జాతీయ విద్యార్థి సమాఖ్య నాయకుడు లాజరస్‌ తెలిపారు. మంగళవారం రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధి, అధికార, పరిపాలనా విభజన మొదలైన డిమాండ్లతో విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ చేస్తున్న ఈ పోరాటంలో ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రభుత్వ, పైవేటు విద్యాసంస్థలు పాల్గొని బంద్‌ విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు మహబూబ్‌బాషా, ఎన్‌. రాజారత్నం, ప్రశాంతి పాల్గొన్నారు.

You might also like