FbTelugu

నేను ఎవర్నీ బెదిరించలేదు: కూన రవికుమార్

శ్రీకాకుళం: మరోసారి కూన రవి కుమార్ ఫోన్ సంభాషణపై వివాదం తలెత్తింది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మోహన్ కు చెందిన భవనంలో టీడీపీ ఆఫీను తరలించనంటూ ఫోన్ లో బెదిరించారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని టీడీపీ నేత కూన రవీకుమార్ స్పష్టం చేశారు. పొందూరులో ఉన్న బిల్డింగ్ జాయింట్ ప్రాపర్టీ అని తెలిపారు.

గత పదేళ్ల నుంచి టీడీపీ ఆఫీస్ ఆ బిల్డింగ్ లోనే ఉందని అన్నారు. కేవలం మర్యాద తక్కువ పనులు చేయవద్దని చెప్పానని అన్నారు. పొందూరు ఆఫీసు బిల్డింగ్ పై ఇద్దరికీ హక్కుందని అన్నారు. తాను బెదిరించానని వస్తున్న వార్తలను పూర్తిగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

You might also like