FbTelugu

రోగిని కొరికి చంపిన ఎలుకలు

ముంబయి: ఐసియులో చికిత్స పొందుతున్న ఒక రోగిని ఎలుకలు కొరికి చంపేశాయి. ఈ విషయం తెలుసుకున్న మిగతా రోగులు ఐసియు నుంచి పరుగులు తీశారు.
ముంబయిలోని కుర్లా కమాని ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ ఎల్లప్ప (24) శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతుండడంతో రాజావాడి ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడువాపు వ్యాధితో పాటు కాలేయ సమస్యతో బాధపడుతున్నాడని ఐసియులో చేర్పించారు.

మంగళవారం ఉదయం రోగి కంటి కింది నుంచి రక్తస్రావం కావడంతో సోదరి నర్సులకు సమాచారం ఇచ్చింది. ఎలుకలు కరవడంతో ఇలా జరిగిందని, ఏమి కాదని చెప్పి వైద్యులు సముదాయించారు. నర్సులు, వైద్యులు కలిసి అతని కంటికింద బ్యాండేజి వేసి ఇంజక్షన్లు ఇచ్చారు. అయితే 24 గంటల తరువాత రోగి శ్రీనివాస్ ఎల్లప్ప ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసిన ముంబయి మేయర్ కిశోరి పడ్నేకర్ వెంటనే రాజావాడి ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో ప్రతి వార్డు, రూమ్, ఐసియు, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించారు. తనిఖీలు చేయాల్సిందిగా కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది. నివేదిక వచ్చిన తరువాత కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.