FbTelugu

తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ?

న్యూఢిల్లీ: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం పచ్చజెండా ఊపినట్లు తెలిసింది.
ఏపీ కి చెందిన రత్నప్రభ కర్నాటక ఐఏఎస్ అధికారి గా పలు హోదాలలో పనిచేసి జూన్ 2018లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. పదవీ విరమణ అయిన తరువాత ఏప్రిల్ 2019 లో ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బిఎస్.యడ్యూరప్ప సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీజేపీలో చేరినట్లు ఆమె ప్రకటించారు.

1981 బ్యాచ్ కు చెందిన రత్నప్రభ కర్ణాటకలో మూడో మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 37 సంవత్సరాల పాటు సేవలందించిన ఆమె జూన్ 2018లో పదవీ విరమణ చేశారు. ఐఏఎస్ అధికారి కత్తి చంద్రయ్య కు ముగ్గురు సంతానం కాగా వారిలో రత్నప్రభ ఒకరు. ప్రఫుల్ చంద్ర డాక్టర్ కాగా రెండో కుమారుడు ప్రదీప్ చంద్ర తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. మూడో సంతానం రత్నప్రభ. ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎ.విద్యాసాగర్ ను రత్నప్రభ వివాహం చేసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.