FbTelugu

తిరుపతి బిజెపి అభ్యర్థిగా రత్నప్రభ

న్యూఢిల్లీ: తిరుపతి బిజెపి అభ్యర్థిగా కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కె.రత్నప్రభ పేరు బిజెపి అధిష్టానం ప్రకటించింది. ఉమ్మడి ఏపీకి చెందిన రత్నప్రభ కర్ణాటకలో పలు హోదాలలో పనిచేసి 2018 లో ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయ్యారు.

2019లో ఆమె బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికల అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగుతున్నారు. జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. నామినేషన్ ప్ర్రక్రియ పూర్తి కాగానే రెండు పార్టీల నాయకులు ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.