అమరావతి : రాష్ట్రంలోని ప్రజలకు బయోమెట్రిక్ లేకుండానే రేషన్ ఇవ్వాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారని తెలిపారు. వేలి ముద్రలతో కరోనా వ్యాపించే అవకాశం ఉందన్నారు. అందుకోసమే బయోమెట్రిక్ లు ఉపయోగించకుండానే రేషన్ పంపిణీ చేయాలని సూచించారు.