FbTelugu

 రేషన్ దుకాణాలు జనంతో కిటకిట

చెన్నై: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాలు జనంతో కిటకిటలాడాయి. మంగళవారం ఉదయం నుంచే జనాలు బారులు తీరి నిల్చున్నారు. కరోనాతో చితికిపోయిన కుటుంబాలకు రూ.2వేల సాయంతో పాటు, 14 రకాల నిత్యావసర సరకుల పంపిణీ చేశారు.

తమిళనాడులో సిఎం గా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కరోనా బాధితులను ఆదుకునేందుకు రూ.2 వేల సహాయ పథకం ప్రకటించారు. దీంతో పాటు నెలకు సరిపడా 14 రకాల నిత్యావసర సరకులు రేషన్ దుకాణాల ద్వారా అందచేస్తామని తెలిపారు. ఆ ప్రకారంగానే ఈ నెలా మూడవ తేదీన తన తండ్రి జయంతి సందర్భంగా ప్రారంభించారు. ఈ నెల కూడా డబ్బులు ఇచ్చేందుకు రూ.4196 కోట్ల నిధులు విడుదల చేశారు. నిత్యావసర సరకుల కోసం రూ.844 కోట్లు విడుల చేశారు. మంగళవారం ఉదయం మైలాపూర్, విల్లివాక్కం, కిల్పాక్, పెరంబూర్, రాయపేట ప్రాంతాల్లో రేషన్ దుకాణాల్లో జనం క్యూలో నిల్చుని సరకులతో పాటు నగదు తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.