FbTelugu

ఈ నెల నుంచి పెరగనున్న రేషన్ ధరలు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఈ డిసెంబర్ నుంచే రేషన్ సరుకుల ధరలు పెరగనున్నాయి. నాలుగు నెలల క్రితమే ఈ ధరలు పెరిగినా కరోనా కారణంగా ఇప్పటి వరకు సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తూ వచ్చారు. తాజాగా పెరిగిన ధరలతో.. బహిరంగ మార్కెట్లో సరుకుల ధర కంటే రూ. 20, 30లు తేడా మాత్రమే ఉండనున్నట్టు తెలుస్తోంది.

రేషన్ కార్డులో ఉన్న ఇంటి సభ్యులు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అరకిలో పంచదార ఇవ్వనున్నారు. కందిపప్పు ఇప్పటి వరకు కిలో రూ. 40 ఉండగా.. తాజాగా రూ. 27 పెరిగి రూ. 67 అయ్యింది. చెక్కెర అరకిలో రూ.17కు చేరింది. బియ్యానికి ఎప్పటిలాగే కిలోకి రూపాయి చెల్లించాలి.

You might also like

Leave A Reply

Your email address will not be published.