* భారీగా పాత రేషన్ కార్డుల తొలగింపు
* కొత్త కార్డుల జారీకి ఇంటింటి సర్వే
* వైఎస్ఆర్ నవశకంలో భాగంగా కొత్త కార్డులు జారీ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీలో సమూల మార్పులు చేపట్టింది. నెల రోజుల్లోనే 8.44 లక్షల పాత రేషన్ కార్డులను తొలగించింది. ఈ నెల నుంచి పాత రేషన్ కార్డులను పక్కన పెట్టి కొత్త బియ్యం కార్డులపై నిత్యావసరాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పాత రేషన్ కార్డులపై రేషన్ ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ఆర్ నవశకంలో భాగంగా రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా బియ్యం కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించింది. వాలంటీర్లతో ఇంటింటి సర్వే చేసి కొత్త కార్డులు జారీ చేసింది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త బియ్యం కార్డులపైనే రేషన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది.