FbTelugu

బీజేపీ నేతలకు వినతిపత్రాలు ఇవ్వాలి: మంత్రి నాని

అమరావతి: రేషన్ డీలర్లు మాజీ సీఎం వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తున్నారు, అలా కాకుండా బీజేపీ నేతల విగ్రహాలకు వినతి పత్రాలను ఇస్తే బాగుంటుందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హితవు పలికారు.
ఇంటి వద్దకే రూపొందించిన రేషన్ పంపిణీ వాహనాలను పౌరసఫరాలశాఖ మంత్రి కొడాలి నాని పరిశీలించారు. రేషన్ డీలర్లకు ఇవ్వవలసిన 8విడతల కమీషన్లలో రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలు చెల్లించిందన్నారు. మిగిలిన 4 విడతల కమిషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటం తో చర్చలు జరుపుతున్నాంమంత్రి కొడాలి నాని వెల్లడించారు.
40ఏళ్లుగా రేషన్ డీలర్లు గా ఉన్న సభ్యులు ప్రజలకు సేవ చెయ్యలే తప్ప వివాదాలు సృష్టించవద్దు ఆయన కోరారు. రేషన్ డీలర్లు ఎవరైనా ప్రజలకు రేషన్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడితే వారిపై చర్యలు తీసుకొని కొత్తవారిని నియమిస్తామని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.

You might also like