FbTelugu

బాలీవుడ్ ఛాన్స్ పట్టేసిన రాశి ఖన్నా!

బాలీవుడ్ ఛాన్స్ పట్టేసిన రాశి ఖన్నా!
ఇప్పటివరకూ హీరోయిన్ రాశి ఖన్నా నిదానంగా సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. అందాన్ని వెతుక్కుంటూ అవకాశాలు అవే వస్తాయనే నమ్మకంతో వెయిట్ చేస్తూ కూర్చుంది. అవకాశాలను తామే వెతుక్కుంటూ వెళ్లాలనే విషయాన్ని రాశి ఖన్నా గ్రహించేసరికి ఆలస్యమైపోయింది. ఇక అప్పటి నుంచి అన్ని వైపులా ఒక లుక్కేస్తూ ముందుకు వెళుతోంది. ప్రస్తుతం రాశీఖన్నా

తెలుగులో నాగ చైతన్య జోడీగా ‘థ్యాంక్యూ’ .. గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’ చేస్తోంది. తమిళంలో ఆమె చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు చేస్తూనే ఆమె హిందీలో వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. మొత్తం మీద ఖాళీగా లేకుండా రాశి ఖన్నా తన కెరియర్ ను కొనసాగిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆమెకి ‘యోధ’ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. కరణ్ జొహార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, పుష్కర్ ఓజా దర్శకత్వం వహించనున్నాడు. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఒక నాయికగా దిశా పటాని చేయనుండగా, మరో నాయికగా రాశి ఖన్నాను తీసుకున్నారట. కాస్త ఆలస్యమైనా రాశి ఖన్నా మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.