FbTelugu

స్నేహితుని ప్రేయసితో రాసలీలలు

* హతమార్చి పూడ్చేసిన స్నేహితుడు

ముంబై : ఓ యువకుడు తన స్నేహితుని ప్రియురాలిని ముగ్గులోకి దింపి రాసలీలలు సాగిస్తుండగా.. గుర్తించిన స్నేహితుడు యువకున్ని హతమార్చి రోడ్డుపక్కన పూడ్చేసిన ఘటన ముంబైలోని షిల్ ఫాటా ఏరియాలో చోటుచేసుకొని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకెళితే.. షిల్ ఫాటా ఏరియాకు చెందిన జుబేర్ హ‌స‌న్ ఖాన్, అమీర్ హాస‌న్ ఇద్దరూ స్నేహితులు. జుబేర్ ఖాన్ కు ఓ ప్రియురాలు ఉంది.

తరచూ అమీర్ హాస‌న్ వస్తూ స్నేహితుని ప్రియురాలిని బుట్టలో వేసుకున్నాడు. వారు జుబేర్ ఖాన్ లేని సమయంలో రాసలీలు కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన జుబేర్ ఖాన్ అమీర్ హాస‌న్‌పై ప‌గ పెంచుకున్నాడు. మూడు రోజుల క్రితం అమీర్ హాస‌న్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చి అక్కడే పూడ్చేశాడు. తమ కుమారుడు కనిపించడంలేదని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి అసలు విషయాన్ని బయటపెట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.