FbTelugu

విజయవాడ యువతికి అరుదైన గౌరవం

విజయవాడ: నగరానికి చెందిన యువతికి అరుదైన గౌరవం దక్కింది. బి. నాగదుర్గా కుసుమసాయి అనే యువతి తెలుగు విశ్వసుందరి కిరీటం దక్కించుకుంది.

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా, ఇతర తెలుగు సంస్థలు సంయుక్తంగా వరల్డ్‌ తెలుగు కల్చరల్‌ ఫెస్ట్‌ 2020 పోటీలను ఆన్‌లైన్‌లో నిర్వహించాయి. ఈ పోటీలో ఆమె విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఈ పోటీల్లో మొత్తం 600 మంది యువతులు పాల్గొనగా వారిలో కుసుమసాయి విజేతగా నిలిచింది.

You might also like