హైదరాబాద్: తెలంగాణలో ర్యాపిడ్ టెస్టులు, ర్యాండమ్ టెస్టులు అవసరం లేదని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
ఇంత వరకు ఎక్కడ కూడా ర్యాపిడ్ టెస్టులు చేయలేదని, ర్యాండమ్ టెస్టులు కూడా అవసరం లేదని ఆయన స్ఫష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే కరోనా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేస్తున్నామన్నారు.
ప్రజల ప్రాణాలను కాపాడ్డంతో తెలంగాణ ముందున్నదని, కరోనా కేసుల సంఖ్యను కూడా దాచిపెట్టడం లేదన్నారు. రాష్ట్రం తొందరలోనే మహమ్మారి నుంచి బయటపడుతుందని, మే 8వ తేదీ వరకు కరోనా ఫ్రీగా రాష్ట్రం అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.