FbTelugu

రాఫెల్ యజమాని దుర్మరణం

ప్యారిస్: యద్ధ విమానాల తయారీ సంస్థ రాఫెల్ యజమాని ఓలివర్ డసాల్డ్ రాఫెల్ దుర్మరణం పాలయ్యారు. ఫ్రాన్స్ లోని నార్మాండి ప్రాంతంలో ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఫ్రాన్స్ దేశాన్ని ఎంతగానో ప్రేమించే ఓలివర్ డసాల్డ్ రాఫెల్ (69) ఆకస్మిక మరణం తమకు తీరని నష్టమని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మెక్రాన్ ట్వీట్ చేశారు. ఫ్రెంచ్ విమానాల తయారీ దిగ్గజం డసాల్డ్ ఏవియేషన్ వ్యవస్థాపకుడు మార్సెల్ డసాల్డ్ మనవడే ఓలివర్. 2002లో ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలోని దిగవ సభకు ఎన్నిక కాగా, ప్రస్తుతం పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతున్నారు. ఫోర్భ్స్ గణాంకాల ప్రకారం ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 361 స్థానంలో ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.