FbTelugu

వావి వరుసలు మరిచి అత్యాచారం…

హైదరాబాద్: రోజు రోజుకు మానవత్వం, వావి వరుసలు అనేవి మంటగలిసిపోతున్నాయి. పిన్ని కూతురునే అత్యాచారం చేసి, ఆ పై వీడియో తీసి బెదిరించబోయిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిలింనగర్ మహత్మాగాంధీ నగర్ లో ఒక యువతి (22) ఉంటున్నది. ఏయిర్ హోస్టెస్ గా ఒక ప్రైవేటు సంస్థలో శిక్షణ తీసుకుంటున్నది. తన తల్లి సోదరి కుమారుడు నిఖిల్ (27) కూడా తన కాలనీలోనే టైలర్ గా పనిచేస్తున్నాడు. అప్పు కావాలని నిఖిల్ కోరడం, పిన్ని కుమారుడే కదా అని రూ.50వేలు అప్పుగా ఇచ్చింది. ఈ నెల 2వ తేదీన డబ్బులు ఇస్తానని చెప్పి సోదరిని నిఖిల్ తన రూమ్ కు పిలిపించుకున్నాడు. కూల్ డ్రింక్ లో మద్యం కలిపి ఆమెతో తాగిపించాడు. కొద్ది సేపటి తరువాత ఆమె గాఢ నిద్రలోకి జారుకున్నది. ఆ తరువాత ఆమె పై అత్యాచారం చేసి నగ్న శరీరాన్ని వీడియో తీశాడు. ఈ నెల 4న తన డబ్బు ఏమైందని ఆమె నిఖిల్ ను అడగ్గా, డబ్బులు ఇచ్చేది లేదని స్పష్టం చేశాడు. తన ఇంటికి వచ్చిన సందర్భంలో అత్యాచారం చేశానని, ఎవరికైనా చెబితే వీడియో షేర్ చేస్తానని బెదిరించడంతో ఆమె హతాశురాలయ్యింది. షాక్ కు గురైన బాధితురాలు జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.