FbTelugu

ఆరేళ్ల క్రితం అత్యాచారం… ఇప్పుడు అరెస్టు

న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ను అత్యాచారం చేయగా ఇప్పుడు బాధితురాలి ఫిర్యాదుతో పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముప్పై సంవత్సరాల వయసు ఉన్న మహిళా కానిస్టేబుల్ ను డిఐజి, స్పోర్ట్సు ఆఫీసర్ గా పనిచేస్తున్న ఖజన్ సింగ్, జట్టు కోచ్ గా ఉన్న ఇన్ స్పెక్టర్ సుర్జిత్ సింగ్ వేధించినట్లు నిరూపణ అయ్యింది. 2104 అక్టోబర్, నవంబర్ నెలలో ఢిల్లీలోని వసంత్ కుంజ్ లో ఒక ఫ్లాట్ కు తనను తీసుకువెళ్లారని ఆరోపించింది. ఇద్దరు వరుసగా మూడు రోజుల పాటు అనుభవించారని తెలిపింది.  ప్రాథమిక దర్యాప్తులో అత్యాచారం జరిగినట్లు తేలడంతో ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 1986 సియోల్ లో జరిగిన ఆసియా క్రీడల్లో డిఐజి ఖజన్ సింగ్ రజత పతకం సాధించాడు. అర్జున అవార్డు రిఫరీ కూడా. ఈ అత్యాచారం కేసుపై సీనియర్ ఐపిఎస్ అధికారి చారు సిన్హా విచారణ చేస్తున్నారు. బాధిత మహిళ తనకు న్యాయం చేయాలంటూ నేషనల్ విమెన్స్ కమిషన్, సి.ఆర్.పి.ఎఫ్ డైరెక్టర్, కేంద్ర హోం శాఖ కార్యదర్శులకు ఫిర్యాదు చేయడంతో ఆరేళ్ల క్రితం అత్యాచారం కేసు వెలుగు చూసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.