FbTelugu

కరోనా యువతిపై అత్యాచారం

ఢిల్లీ: రోగం వచ్చి ఆ యువతి బాధపడుతుండగా, కన్నేసిన డ్రైవర్ మార్గ మధ్యలో అంబూలెన్స్ ఆపి అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ తరువాత ఆ యువతిని తీసుకువెళ్లి కరోనా చికిత్సా కేంద్రంలో వదిలేశాడు.

తిరువనంతపురానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నపతనన్ మిట్ట ప్రాంతంలో ఒక యువతిక (19) పాజిటివ్ వచ్చింది. టెస్టు రిపోర్టులు రావడంతో ఆమెను సమీపంలోని కోవి సెంటర్ సెంటర్ కు తరలించాలని నిర్ణయించి అంబూలెన్స్ కు ఫోన్ చేశారు. ఆమెను తీసుకు వెళ్లేందుకు 108 అంబూలెన్స్ డ్రైవర్ నౌఫాల్ (25) వచ్చాడు. ఈమెతో పాటు మరో వృద్ధురాలిని తీసుకువెళ్లాల్సి ఉంది. తొలుత వృద్ధురాలిని ఒక సెంటర్ లో వదిలి, ఆ తరువాత యువతిని పండాలమ్ తీసుకువేళ్లేందుకు బయలుదేరాడు.
అప్పటికే ఆ యువతిపై కన్నేసిన డ్రైవర్ ఖాళీ ప్రదేశంలోకి అంబూలెన్స్ తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడి, అర్థరాత్రి సమయంలో పండాలమ్ లోని కోవిడ్ సెంబర్ లో వదిలేసి వెళ్లిపోయాడు. బాధితురాలు హాస్పిటల్ లో వైద్యులకు ఫిర్యాదు చేయగా, వెంటనే పోలీసులకు తెలియచేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని డ్రైవర్ నౌఫాల్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి కెకె.శైలజ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, డ్రైవర్ ను తొలగించాలని 108 అంబూలెన్స్ సర్వీసు యాజమాన్యం జీవీకే ను కోరారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని మంత్రి పోలీసులను ఆదేశించారు.

You might also like