FbTelugu

డిజైనర్ మిహీకాతో రానా దగ్గుబాటి పరిణయం

యాక్టర్ రానా దగ్గుబాటి త్వరలో ఇంటీరియర్ డిజైనర్ మిహీకా బజాజ్ ను త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని రానా దగ్గుబాటి అధికారికంగా ట్విటర్ లో ప్రకటించారు.

తను ప్రేమించిన అమ్మాయి ఓకే చెప్పిందని, తన పేరు మిహీకా బజాజ్ అంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫొటో షేర్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన మిహీకా ముంబయిలో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరుతో ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్, డెకార్ కంపెనీని నిర్వహిస్తున్నారు.

లండన్‌లోని చెల్షియా యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ డిజైన్‌లో ఎంఏ చేశారు. ఇక మిహీకా తల్లి బంటీ బజాబ్ హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజిక్ యూనివర్సిటీ నుంచి జ్యూయల్లరీ డిజైన్ లో పట్టా పొందారు. బంటీ బజాజ్ భర్త సురేష్ బజాజ్ తో కలిసి క్రసాల బ్రాండ్ పేరుతో జ్యూయల్లరీ షాపు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఇండియాలోని టాప్ వెడ్డింగ్ డెకార్ ప్లాన్‌లో ఒకరిగా బంటీ పేరుగాంచారు. ఇక మిహీకాకు సమర్థ్ సోదరుడు కాగా.. ఆయన ప్రముఖ డిజైనర్ కునాల్ రావల్ సోదరి శాషాను వివాహం చేసుకున్నారు.

You might also like