అమరావతి: ఏపీ ప్రభుత్వంపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ కోర్టు ధిక్కార పిటిషన్ వేయనున్నారు. హైకోర్టును రమేష్ ఆశ్రయించనున్నారు.
ఏపీ ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీలపై రమేష్ ధిక్కార పిటిషన్ దాఖలు చేయనున్నారు. తనను పదవిలో కొనసాగించాలన్న కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయలేదంటూ పిటిషన్ లో వివరించారు.
ఏపీ ప్రభుత్వంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు ధిక్కార పిటిషన్? అంటూ సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ట్వీట్ చేశారు. కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం ఇవాళ్టి లోగా అమలు చేస్తుందా..? అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు.