FbTelugu

కరోనాకు ఆయుర్వేద మందు సిద్ధం! : రామ్ దేవ్ బాబా

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే.. కాగా ఈ వైరస్ కు ఇప్పటివరకూ మందు లేదు. వ్యాక్సిన్ కనుగొనడంలో అనేక దేశాలు నిమగ్నమైనాయి.

ఈ తరుణంలో ప్రముఖ యోగాగురువు రామ్ దేవ్ బాబా కీలక ప్రకటన చేశారు. ఈ వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనగల ఆయుర్వేద ఔషధాన్ని సిద్ధం చేసినట్టుగా ప్రకటించారు. అశ్వగంధ, గిలోయ్ సమ్మేళనంతో తయారు చేసిన ఔషధంతో కరోనాకు చెక్ పెట్టవచ్చని కేంద్రానికి ఓ లేఖ ద్వారా తెలిపారు. ఈ ఔషధం సమర్థవంతంగా వైరస్ ను అడ్డుకుంటుందని తెలిపారు. కాగా ప్రస్తుతం క్లినికల్ కంట్రోల్ ట్రయల్స్ జరుగుతున్నట్టు తెలిపారు. అతి త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకుని వస్తామని దీమా వ్యక్తం చేశారు.

You might also like