FbTelugu

రామతీర్థంలో రగడ… రగడ…

విజయనగరం: రామతీర్థం క్షేత్రం అధికార వైసీపీ నేతలు, టీడీపీ నాయకుల పర్యటనతో రణరంగంలా మారింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు పర్యటనకు పోటీగా ముందుగానే వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి పర్యటించడంతో ఉద్రిక్తంగా మారింది.

రెండు పోటాపోటీ లో మనమెక్కడ వెనకబడతామోనన్న ఆందోళనతో బీజేపీ నాయకులు కూడా ధర్నాకు దిగారు. దీంతో ఈ ప్రాంతం అట్టుడికింది. రామతీర్థ పర్యటనను చంద్రబాబు నాయుడు ముందుగానే ఖరారు చేశారు. ఆ ప్రకారంగానే చంద్రబాబు ఇవాళ రోడ్డు మార్గాన రామతీర్థం బయలు దేరారు. చంద్రబాబు రాకకు ముందే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రామతీర్థం చేరుకున్నారు. బీజేపీ నేతలు కొంద కింద ఆందోళన చేస్తుండగానే, విజయసాయి తన అనుచరగణంలో కొండ మీదికి వెళ్లారు. వైసీపీ వాళ్లను అనుమతించి తమను అనుమతించడం లేదంటూ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

కొండ నుంచి దిగి వస్తున్న క్రమంలో విజయసాయి వాహనంపై ఒక వ్యక్తి రాయి విసరడంతో ఆయన వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా వైసీపీ, బీజేపీ, టీడీపీ శ్రేణులు పోటీపడి నినాదాలు చేశారు. ఆయన అక్కడ ఉండాగానే చంద్రబాబు కూడా చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ ను మరో మార్గానికి పోలీసులు మళ్లించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.