FbTelugu

రామతీర్థం ఎఫెక్ట్… అశోక్ గజపతి తొలగింపు

అమరావతి: విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయం ధర్మకర్త పదవి నుంచి మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ నాయకుడు అశోక్ గజపతి రాజుపై రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.
ఈ ఆలయంతో పాటు మందపల్లి, పైడితల్లి దేవాలయాల ధర్మకర్త పదవి నుంచి పీకేస్తూ ఇవాళ రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో ఇచ్చిన జీఓ 65ను ఉపసంహరిస్తూ దేవాదాయ శాఖ తాజాగా మెమో జారీ చేయడం సంచలనం కలిగిస్తోంది. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసానికి ధర్మకర్త విధుల్లో నిర్లక్ష్యమే కారణమని దేవాదాయ శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
రామతీర్థం ఘటన గురించి తెలుసుకునేందుకు ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష కార్యాచరణకు దిగిన విషయం తెలిసిందే. చంద్రబాబు వస్తున్నారని తెలిసి, వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ముందుగానే అక్కడికి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.