FbTelugu

బాబును చెత్తబుట్టలో పడేశారు: రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: రాష్ట్రంలో ఇవ్వాల్టి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పరిపాలనకు నిదర్శనం అని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్.జగన్ తన రెక్కల కష్టంతో నిర్మించుకున్న పార్టీ వైసీపీ అని పేర్కొన్నారు. పార్టీ గెలుపు క్రెడిట్ అంతా ఆయనను ఆశీర్వదించిన ప్రజలదేనని చెప్పారు. అక్కా చెల్లెల్లు, అన్నదమ్ములు, అవ్వతాతలు తన వైపు ఉన్నారని సీఎం జగన్‌కి భరోసా ఉందని, నేడు అదే నిజమైందని చెప్పారు. వారి కుటుంబంలో ఒకరిగా సీఎంను గుర్తించారని రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఫలితాలు వచ్చాయిని, ఒక నాయకుడిపై ఇంత భరోసా చూపడం దేశంలోని ఇది తొలిసారి అని ఆయన చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ప్రచారం పేరిట, ప్రజల్ని బూతులు తిట్టారని మండిపడ్డారు. ఈ రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, చంద్రబాబు హైదరాబాద్ లో‌ కూర్చున్నారని, ఆయన తమ్ముడు కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఐదేళ్ల పాలనలో విసిగి వేసారిన ప్రజలు ప్రజలు తమ ఓటుతో చెత్తబుట్టలో వేశారని రామకృష్ణారెడ్డి అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.