FbTelugu

ల్యాండ్ పూలింగ్ పెద్ద స్కామ్: రామకృష్ణా రెడ్డి

తాడేపల్లి: ల్యాండ్‌ పూలింగ్‌ అనేది ప్రపంచంలోనే పెద్ద స్కామ్‌ అని, అందులో భాగమే అసైన్డ్‌ భూముల అక్రమ వ్యవహారమని ఏపీ ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

నిరుపేదలను బెదిరించి ఆ భూములపై అగ్రిమెంట్లు చేసుకున్నారని, పరిహారం రాదని బెదిరించి అసైన్డ్‌ భూములు లాక్కున్నారన్నారు. ఇవాళ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. భూములు లాక్కున్న తరువాత ల్యాండ్‌ పూలింగ్‌ చట్టంలో సవరణలు చేశారు. దీని కోసం జీఎం నెం.41 జారీ చేశారన్నారు. ఆ విధంగా అప్పుడు ప్రభుత్వ పెద్దలకు ఎంతో మేలు చేశారని రామకృష్ణా రెడ్డి తెలిపారు.
ఇప్పుడు అసలు అది కేసే కాదన్నట్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

అందుకే స్టింగ్‌ పేరుతో నాటకాలు. లేని పోని ప్రచారాలు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ తప్పూ చేయకపోతే కేసు దర్యాప్తుకు సహకరించాలి. లేదా చేసిన మోసానికి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగాలని చంద్రబాబు ప్రయత్నించారు. ఇప్పుడు గొంతులో అడ్డంగా ఇరుక్కుని తంటాలు పడుతున్నారన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌. అసైన్డ్‌ భూముల వ్యవహారాలు అంతా అక్రమమేనని ఆయన స్పష్టం చేశారు. రాజధాని పేరుతో పచ్చిగా రియల్‌ ఎస్టేట్‌ దందా. చంద్రబాబుకు రాజధానిపై ప్రేమ అన్నదే లేదు. కేవలం దోపిడి తప్ప మరోటి కాదన్నారు. అదే ఉంటే విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని కట్టేవారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.