FbTelugu

రెండు నాల్కల ధోరణి మానుకోవాలి: రామకృష్ణ

అమరావతి: బీజేపీ రెండు నాల్కల ధోరణి మానుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు విమర్శలు చేశారు.

బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఇన్ చార్జ్ దియోధర్ ప్రకటన మోసపూరితమని అన్నారు.  అమరావతికి రాష్ట్ర బీజేపీ నేతలు మద్దతు ఇస్తుంటే.. మరో వైపు కేంద్ర జోక్యం ఉండదంటూ ఢిల్లీ బీజేపీ నేతలు ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. ప్రత్యేక హోదాపై చేసినట్టుగానే అమరావతిపై మోసానికి సిద్ధపడ్డారా అంటూ ప్రశ్నించారు. ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతిపై బీజేపీ దొంగనాటకాలు తగదన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.