FbTelugu

మావోలకు షెల్టర్ ఇచ్చిన రవీందర్‌రావు: సీపీ సత్యనారాయణ

మంచిర్యాల: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వారణాసి సుబ్రమణ్యం దంపతులకు గురజాల రవీందర్‌రావు నెల రోజుల పాటు షెల్టర్ ఇచ్చారని రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.

రవీందర్‌రావుకు మావోయిస్టులతో దగ్గరి సంబంధాలున్నాయని ఆయన తెలిపారు. మావోయిస్టు నేతలు బండి ప్రకాష్, భాస్కర్, వర్గీస్‌లతోనూ సన్నిహితంగా ఉన్నాడని, పక్కా ఆధారాలతోనే రవీందర్‌ ను అరెస్ట్‌ చేశామని ఆయన చెప్పారు. రవీందర్‌ నుంచి మెమొరీ కార్డులు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రవీందర్‌ అరెస్ట్‌ను తెలంగాణ పౌరహక్కుల సంఘం ఖండించింది. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఆయన ను అరెస్ట్ చేయడం అన్యాయమని ఖండించారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంఘాలపై తీవ్రమైన నిర్బంధాన్ని కొనసాగిస్తోందని మండిపడ్డారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.