FbTelugu

గల్ఫ్ దేశాల్లో 24నే రంజాన్

న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల్లో శుక్రవారం చంద్రుడు కనిపించకపోవడంతో ఈద్-ఉల్-ఫితర్ పండుగను మే 24వతేదీన జరపాలని సౌదీఅరేబియా దేశ మతపెద్దలు నిర్ణయించారు.

శనివారం నెలవంక కనిపించే అవకాశముండటంతో మే 24న ఈద్-ఉల్-ఫితర్ జరపాలని సౌదీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం చంద్రుని వీక్షణ కోసం యూఏఈ న్యాయశాఖ మంత్రి అధ్యక్షతన వీక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే కర్ణాటక రాష్ట్రంలోనూ శుక్రవారం చంద్రుడు కనిపించలేదు.

లడఖ్, కార్గిల్ ప్రాంతాల్లో నెలవంక కనిపించడంతో అక్కడ ఈరోజే ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోవాలని నిర్ణయించారు. కేరళ, కర్ణాటక ప్రాంతా్లో మే 24వతేదీన ఈద్-ఉల్-ఫితర్ జరపాలని నిర్ణయించినట్లు కేరళలోని హిలాల్ కమిటీ పేర్కొంది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఈద్-ఉల్-ఫితర్ ఏ రోజు జరుపుకుంటారనే విషయం శనివారం సాయంత్రం నెలవంక దర్శనం తరువాత నిర్ణయించనున్నారు.

You might also like