FbTelugu

మర్డర్ వస్తోంది… జాగ్రత్త: ఆర్జీవీ

రామ్ గోపాల్ వర్మ మర్డర్ చిత్రం త్వరలో థియేటర్లలో కనిపించనున్నది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రేమికుడు ప్రణయ్ దారుణ హత్య నేపథ్యం ఆధారంగా ఈ చిత్రం తీశారు.

దీనిపై ప్రణయ్ భార్య అమృత, తండ్రి బాలస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. విచారణ తరువాత విడుదల చేసేందుకు హైకోర్టు సమ్మతించింది. ఈ సినిమాకు సంబంధించిన సమాచారాన్ని రామ్ అభిమానులతో పంచుకుంటూ ట్వీట్ చేశారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెట్ ను ఆయన పోస్టు చేశారు. మర్డర్ మువీ విడుదలకు అన్నీ అడ్డంకులు తొలిగాయి. ఇక థియేటర్లలో చంపడానికి మర్డర్ వస్తుందంటూ ఆయన పేర్కొన్నారు.

నట్టీస్ ఎంటర్ టైన్ మెంట్, క్విటీ ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై కంచర్ల అనురాగ్ సమర్పణలో వస్తున్న మర్డర్ చిత్రంలో వర్మ పాటలు పాడారు. దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.