FbTelugu

నలుగురు స్టార్స్ తో రామ్ చరణ్ మువీ

ఈ మధ్య టాలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా మూవీలలో బిజీ అయిపోయారు. శంకర్ దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ తేజ నటించనున్న సినిమా ఈ ఏడాది సెట్స్ మీదకు రానున్నది.

భారీ తారాగణంతో విజువల్ వండర్ గా నిర్మిస్తాడన్న పేరున్న శంకర్ ఈ సినిమాలో నలుగురు సూపర్ స్టార్స్ ను తీసుకుంటున్నట్లు టాక్ వినబడుతోంది. నలుగురు సూపర్ స్టార్స్ కు తగ్గట్టుగా శంకర్ కథను రెడీ చేస్తున్నాడు. కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 కొంత టాకీ పార్ట్ మిగిలి ఉండగానే రామ్ చరణ్ సినిమాకు జెండా ఊపారు. తాజాగా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో అపరిచితుడు హిందీ రీమేక్ చిత్రం తీస్తున్నాడు.
అయితే రామ్ చరణ్ సినిమాలో హీరో కొణిదెల పవన్ కళ్యాణ్, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో ఉపేంద్ర లేదా సుదీప్ ను కాని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. రామ్ చరణ్ సిని జీవితంలో ఇదో గొప్ప సినిమా గా మిగలనుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ మల్టీ స్టారర్ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో చూడాలి మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.