FbTelugu

ఫేక్ న్యూస్ పై రకుల్ భగ్గు

దక్షిణాది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాపై భగ్గుమంటున్నారు. మందుల కోసం మెడికల్ షాపుకు వెళ్తే మందు కోసం వైన్ షాప్ కు వెళ్లినట్లు దుష్ర్పచారం మొదలుపెట్టారని మండిపడుతోంది. అయితే ఈ వార్తలపై ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది. తమిళ స్టార్ శివ కార్తికేయన్, రకుల్ జంటగా తమిళంలో అయాలన్ అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి రవికుమార్ దర్శకత్వం వహిస్తుండగా, లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది.

ఈ చిత్రానికి రకుల్ ఝలక్ ఇచ్చిందనే వార్తలు, కరోనా కారణంగా షూటింగ్ కు బైబై చెప్పిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. అందుకే ఆమెను తప్పించారంటూ తమిళ మీడియా కోడై కూసింది. తనకు షూటింగ్ చేయాలనే ఉంది. ఎక్కడ షూటింగ్ లు చేస్తున్నారో చెప్పండంటూ రకుల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పుకార్లపై దర్శకుడు రవికుమార్ కూడా స్పందించాడు. రకుల్ ను తీసివేశామనే వార్త అవాస్తవమని ఆయన ఖండించారు. వాస్తవాలను చెక్ చేసుకోకుండా వార్తలు రాయడం మీడియా ఎప్పుడు ప్రారంభిస్తుందని ఆమె ప్రశ్నించారు.

You might also like