FbTelugu

రేవంత్ సభలో సీనియర్లకు చురకలు

ధీటుగా జవాబు ఇచ్చిన దాసోజు శ్రవణ్ కుమార్

రంగారెడ్డి: మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి తలపెట్టిన రాజీవ్ రైతు భరోసా పాదయాత్రకు అనుమతులు లేవంటున్న సీనియర్ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్ ధీటుగా జవాబు ఇచ్చాడు.

ఇవాళ రావిర్యాలలో రాజీవ్ రైతు రణభేరి సభలో ఎఐసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్ మాట్లాడుతూ, మన ఇంట్లోకి పాము వస్తే వెంటనే కర్ర తీసుకుని కొడతామా లేక అనుమతి తీసుకుని కొడతామా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి కూడా అలాగే చేస్తున్నారని, అనుమతి కోసం ఎదురుచూడడం లేదని సీనియర్లకు చురకలు అంటించారు. హైదరాబాద్ లో ఐటీఐఆర్ ప్రాజెక్టును తుంగలో తొక్కి.. నిరుద్యోగుల పాలిట కేసీఆర్ శాపంగా మారారని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి తీసుకొచ్చేలా, ఉద్యమాన్ని బలంగా తీర్చిదిద్దేలా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అందరూ బలపర్చాలని దాసోజు శ్రవణ్ కోరారు.

రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసే ఫార్మాసిటీ అంత బోగస్ సిటీ మరొకటి లేదని, పోలీసులను అడ్డుపెట్టుకుని 20 వేల ఎకరాలను లాక్కున్నారని ఆయన ఆరోపించారు. ఆ భూములను వందల కోట్లకు అమ్ముకున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ భూములను వెనక్కి తీసుకుంటామని, అర్హులకు పంచుతామని శ్రవణ్ హెచ్చరించారు.

బ‌హిరంగ స‌భ లో మ‌ల్లు ర‌వి ప్ర‌వేశ పెట్టిన తీర్మాణాలు…

 1. కేంద్రంలోని న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం మంద బ‌లంతో తీసుకొచ్చిన న‌ల్ల వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రైతుల పాలిట శాపంగా మార‌బోతున్నాయి. రైతుల డిమాండ్ మేర‌కు ఆ చ‌ట్టాల‌ను త‌క్ష‌ణం ర‌ద్దు చేయాలి.
 2. న‌ల్ల చ‌ట్టాల ర‌ద్దుకు డిమాండ్ చేస్తూ ఉద్య‌మంలో అశువులు బాసిన ప్ర‌తి రైతు కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించాలి.
 3. న‌ల్ల చ‌ట్టాల‌పై పోరాటం చేస్తున్న రైతుల‌పై పెట్టిన అక్ర‌మ కేసుల‌న్నింటిని భేష‌ర‌తుగా ఎత్తివేయాలి
 4. స్వామినాథ‌న్ క‌మిష‌న్ నివేదిక‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ప్ర‌తి పంట‌కు పెట్టుబ‌డిపై 50 శాతం లాభం క‌లిపి క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర‌లు నిర్ణ‌యించాలి.
 5. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ప‌సుపు బోర్డు ఏర్పాటుకు త‌క్ష‌ణం చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి.
 6. రాష్ట్రంలోని టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం త‌క్ష‌ణం అసెంబ్లీ స‌మావేశ‌ప‌రిచి వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు డిమాండ్‌తో ఏక‌గ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి.
 7. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఎత్తివేత నిర్ణ‌యాన్ని త‌క్ష‌ణం ఉప‌సంహ‌రించుకోవాలి.
 8. కాంగ్రెస్ ప్ర‌భుత్వం 2006లో తీసుకొచ్చిన అట‌వీ హ‌క్కుల చ‌ట్టం ప్ర‌కారం పోడు భూముల‌కు ప‌ట్టాలు ఇవ్వాలి.
 9. గిరిజ‌న భూముల‌ను క‌బ్జా చేసిన టీఆర్ఎస్ నాయ‌కుల‌పై త‌క్ష‌ణం క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాలి.
 10. రైతుల‌కు రూ. 1ల‌క్ష వ‌ర‌కు రుణ మాఫీ చేస్తామ‌ని ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చారు. విడ‌త‌ల వారీగా కాకుండా ఏక మొత్తంలో రూ. 1ల‌క్ష రుణం మాఫీ చేయాలి
 11. తెలంగాణ‌లో రైతుల‌కు ఎరువుల ఉచితంగా ఇస్తామ‌న్న హామీని త‌క్ష‌ణం అమ‌లు చేయాలి.
You might also like

Leave A Reply

Your email address will not be published.