FbTelugu

నలుగురికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డులు

ఢిల్లీ: రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు నలుగురి పేర్లను క్రీడా మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. భారత క్రికెటర్ రోహిత్ శర్మ, రెజ్లర్ వినేష్ పోగట్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా, పారా ఒలంపిక్స్ స్వర్ణ విజేత మరియప్పన్ తంగవేలు పేర్లను ఏకగ్రీవంగా ఆమోదించారు.

అవార్డులకు పేర్ల ఎంపిక కోసం కమిటీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. ప్రతిభ ఆధారంగా రాజీవ్ ఖేల్ రత్న అవార్డులకు పేర్లు సిఫారసు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

You might also like